ఈశ్వరి బాయి దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన ధీర వనిత అని కొనియాడారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ బాషా సాంసృతిక శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే,దివంగత జెట్టి ఈశ్వరిబాయి 107 వ జయంతి వేడుకలు రవీంధ్ర భారతీలో జరిగాయి. ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి సీతక్క,గీతారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. తెలంగాణాలో ఈశ్వరిబాయి ఫైర్ బ్రాండ్ గా ఉండేవారని.. ఇపుడు మళ్ళీ మంత్రి సీతక్క ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఎదిగారని చెప్పారు. మహిళలకు విద్యతో భవిష్యత్తు ఉంటుందన్న కాకా సేవలను గుర్తించి మహిళల సాధికారత కోసం పాటుపడిన గొప్ప మహిళా నేత ఈశ్వరిబాయి అని కొనియాడారు వివేక్. కాకా దళితుల హక్కులు, సామాజిక హక్కుల కోసం పోరాడారని చెప్పారు. ఈశ్వరిబాయి సేవ గుణం అలవర్చుకున్న నేతగా గీత రెడ్డి.. ప్రజాసేవ చేశారని తెలిపారు. ఈశ్వరిబాయి అవార్డును అందుకుంటున్న మంత్రి సీతక్క కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్. ఈశ్వరిబాయి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా చిరస్మరణీయమని అన్నారు.
