నేడు (నవంబర్ 22) నర్సాపూర్ కు మంత్రి వివేక్ వెంకట స్వామి

నేడు (నవంబర్ 22) నర్సాపూర్ కు  మంత్రి వివేక్ వెంకట స్వామి

నర్సాపూర్, వెలుగు: నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్స్‌‌లో శనివారం  నిర్వహించనున్న కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర  కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వస్తున్నట్టు నర్సాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.