
సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకల్లో ఏర్పాటు చేసిన వేర్వేరు కార్యక్రమాల్లో ఇందిరమ్మ రెండో విడత ఇండ్ల ప్రొసీడింగ్స్ ను లబ్దిదారులకు అందజేయనున్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రజ్ఞాపూర్ లోని ఎల్లయ్య ఫంక్షన్ హాల్లో, 12 గంటలకు సిద్దిపేటలో కొండా భూదేవి గార్డెన్, మధ్యాహ్నం 3 గంటలకు దుబ్బాకలో రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు.