చెన్నూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలోనే చెన్నూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో మందమర్రిలో 14 వార్డులో 12 లక్షల డిఎంఎఫ్టి నిధులతో చేపట్టిన సీసీ రోడ్ పనులను మంత్రి వివేక్ వెంకటస్వామి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనని స్థానిక తహశీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు  మంత్రి.  

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా క్యాతన పల్లి,మందమర్రి,చెన్నూరు మున్సిపాలిటీలకు  రూ. 50 కోట్ల నిధులు కేటాయించామన్నారు.  చెన్నూరు  ప్రజలకు ఇంటింటికి స్వచ్హమైన తాగునీరు అందించేందుకు 2.0 అమృత్ స్కిం పథకం కింద రూ.100 కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.  త్వరలో తాగునీటి ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. మందమర్రి మున్సిపాలిటీలో రెండు శ్మశాన వాటికలు నిర్మిస్తామని చెప్పారు. 

అంబేద్కర్ భవనంతో పాటుగా కుల సంఘాల భవనాలను ఏర్పాటు చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు,డ్రైన్లు సోలార్ లైట్ సిస్టమ్ ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ఫస్ట్ ప్రియారిటి ఇస్తున్నామని చెప్పారు.గతంలో రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... చెన్నూరు నియోజక వర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. .