- రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
- రెండు రోజులపాటు క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో
- మంత్రి సుడిగాలి పర్యటన
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థులను గెలిపించాలని కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజలను కోరారు. క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో గురు, శుక్రవారాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పొద్దుపోయేవరకు వివిధ శాఖల ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, చెన్నూరు మార్కెట్‌కమిటీ చైర్మన్ మహేశ్తివారీతో కలిసి రూ.25 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 1వ వార్డు అల్లూరినగర్‌లో రూ. 73.46 లక్షలు, 2వ వార్డు తిలక్‌నగర్‌లో రూ.72.56 లక్షలు,7వ వార్డు గణేశ్టౌన్ షిప్లో రూ.72.56 లక్షలు,8వ వార్డు చైతన్య కాలనీలో రూ.1.89 కోట్లు, 9వ వార్డు ఆర్.ఆర్.నగర్‌లో రూ.46 లక్షలు, న్యూ తిమ్మాపూర్‌లో రూ.52.50 లక్షలు, ఓల్డ్ తిమ్మాపూర్‌లో రూ.44.50 లక్షలు,12వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో రూ.6.17లక్షలు,2వ వార్డు తిలక్‌నగర్‌లో 6.17లక్షలు,14వ వార్డు మల్లికార్జున నగర్ ప్రాంతంలో రూ.27.22 లక్షలు,16వ వార్డు గంగా కాలనీలో రూ.34. 64 లక్షల టీయూఎఫ్ఐడీసీ, డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్, నగర అభివృద్ధి నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
గురువారం చెన్నూర్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో రూ.1.47 కోట్లు, 14వ వార్డులో రూ.98 లక్షలు,7వ వార్డులో రూ.1.63 కోట్లు, 15వ వార్డులో రూ.69 లక్షలు, 16వ వార్డులో రూ.62 లక్షలు,17వ వార్డులో రూ.61 లక్షలు,12వ వార్డులో రూ.68 లక్షలు,13వ వార్డులో రూ.1.40 కోట్లు,5వ వార్డులో రూ.1.31 కోట్లు, 4వ వార్డులో రూ.43 లక్షలు, 18వ వార్డులో రూ.27 లక్షలు, 9వ వార్డులో రూ.20 లక్షలు, 11వ వార్డులో రూ.83 లక్షలు,10వ వార్డులో రూ.42 లక్షలు,3వ వార్డులో రూ.29 లక్షలు, 2వ వార్డులో రూ.38 లక్షలు, ఒకటో వార్డులో రూ.28 లక్షలు, 8వ వార్డులో రూ.51 లక్షల నిధులతో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్లు గద్దె రాజు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల్లో మంత్రి పూజలు..
సంక్రాంతి పర్యదినాన్ని పురస్కరించుకొని చెన్నూరులోని లక్ష్మీదేవర, మైసమ్మ ఆలయాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి హజరత్ సయ్యద్ షా బాబా రహిమతుల్లా గంధం సందల్లో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ముస్లింలతో కలిసి పాల్గొన్నారు. శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని జర్నలిస్టు కాలనీలోని డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి ఇంటికి మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్‌దీపక్ తొలిసారి వచ్చారు.
దీంతో వారిని రఘునాథరెడ్డి కుటుంబ సభ్యు లు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మందమర్రి సీఐ శశీధర్‌రెడ్డి, రామకృష్ణాపూర్, మందమర్రి ఎస్సైలు భూమేశ్, రాజశేఖర్, కాంగ్రెస్ లీడర్లు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, ఒడ్నాల శ్రీనివాస్, మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేశ్, జంగం కళ, శ్యాంగౌడ్, మెట్ట సుధాకర్, గోపురాజం పాల్గొన్నారు.
