సామాజిక సేవను బాధ్యతగా తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

సామాజిక సేవను బాధ్యతగా తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     భారత వికాస్​ పరిషత్​ ట్రస్ట్‌‌ నుంచి ప్రేరణ పొందా: మంత్రి వివేక్​ వెంకటస్వామి
  •     ట్రస్ట్‌‌కు రూ.లక్ష విరాళం..కృత్రిమ అవయవాల పంపిణీ 

కూకట్‌‌‌‌పల్లి, వెలుగు: సామాజిక సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి సూచించారు. కూకట్‌‌పల్లిలోని ‘భారత్​ వికాస్​ పరిషత్​చారిటబుల్​ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి వివేక్‌‌ మాట్లాడుతూ.. భారత్​ వికాస్​ పరిషత్ దశాబ్దాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తనకు తెలుసని చెప్పారు. 

దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని  కొనియాడారు. ట్రస్ట్​ సేవలను చూసి తాను కూడా ప్రేరణ పొందానంటూ ట్రస్ట్‌‌కు రూ. లక్ష విరాళంగా ప్రకటించారు. సేవా కార్యక్రమాల విషయంలో ఎప్పుడైనా వచ్చి తనను కలవవచ్చని చెప్పారు. గతంలో రామగుండంలో లయన్స్​ క్లబ్​ ఆధ్వర్యంలో జైపూర్ ఫుట్స్​ పంపిణీకి తాను రూ. 10  లక్షలు విరాళం ఇచ్చానని గుర్తు చేశారు. ట్రస్ట్​ అధ్యక్షుడు అశ్విని సుబ్బారావు, డాక్టర్​ రంగారావు, కూకట్‌‌పల్లి మున్సిపల్​మాజీ చైర్మన్​ సీహెచ్‌‌ హనుమంతరావు పాల్గొన్నారు.