ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నీలో తొలి మ్యాచ్ ఇండియా X బంగ్లాదేశ్‌‌

ఆసియా చాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నీలో  తొలి మ్యాచ్ ఇండియా X బంగ్లాదేశ్‌‌

న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్‌‌ ట్రోఫీ హాకీ టోర్నీలో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ఇండియా తన తొలి మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌తో తలపడనుంది. ఈ నెల 27 నుంచి నవంబర్‌‌ 5 వరకు ఈ టోర్నీ జరగనుంది. లీగ్‌‌ మ్యాచ్‌‌లు జలంధర్‌‌లో నాకౌట్‌‌ మ్యాచ్‌‌లు మొహాలీలో జరుగుతాయి. 

నవంబర్‌‌ 4, 5న సెమీస్‌‌, ఫైనల్‌‌ మ్యాచ్‌‌లు ఉంటాయి. ఇండియాతో పాటు మలేసియా, జపాన్‌‌, సౌత్‌‌ కొరియా, చైనా, బంగ్లాదేశ్‌‌ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇండియా అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్స్‌‌ ట్రోఫీని గెలిచింది.