షాంఘై మాస్టర్స్‌‌ టెన్నిస్‌‌ టోర్నీ నుంచి జొకో విచ్‌‌ ఔట్‌‌

షాంఘై మాస్టర్స్‌‌ టెన్నిస్‌‌ టోర్నీ నుంచి జొకో విచ్‌‌ ఔట్‌‌

షాంఘై: సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌కు.. షాంఘై మాస్టర్స్‌‌ టెన్నిస్‌‌ టోర్నీలో అనూహ్య ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో హుబెర్ట్‌‌ హుర్కాజ్‌‌ (పోలెండ్‌‌) 6–4, 6–3తో జొకోపై సంచలన విజయం సాధించాడు. మూడు రోజుల కిందటే జొకో.. బీజింగ్‌‌లో చైనా ఓపెన్‌‌ టైటిల్ గెలిచాడు. షాంఘై ప్రొఫెషనల్‌‌ టూర్‌‌లో జొకో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌‌ కూడా ఓడలేదు. 

రెండో సెట్‌‌లో నాలుగో గేమ్‌‌లో డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేయడంతో జొకోవిచ్‌‌ సర్వీస్‌‌ను కోల్పోయాడు. దాంతో హుర్కాజ్‌‌ 3–1తో వెనుదిరిగి చూసుకోలేదు. గంటా 28 నిమిషాల మ్యాచ్‌‌లో హుర్కాజ్‌‌ 13 ఏస్‌‌లతో జొకోను కట్టడి చేశాడు. ఇతర మ్యాచ్‌‌ల్లో బెన్‌‌ షెల్టన్‌‌ (అమెరికా) 6–3, 7–6 (6)తో డేనియల్‌‌ ఆల్ట్‌‌మేయర్‌‌ (జర్మనీ)పై, టాప్‌‌సీడ్‌‌ అలెగ్జాండర్‌‌ జ్వెరెవ్‌‌ (జర్మనీ) 6–4, 7–6 (7/4)తో వూ యిబింగ్‌‌ (చైనా)పై గెలవగా, క్వాలిఫయర్‌‌ రి సకామోటో (జపాన్‌‌) 6–4, 6–4తో 23వ సీడ్‌‌ ఆండ్రీ రబ్లెవ్‌‌ (రష్యా)ను ఓడించి సంచలనం సృష్టించాడు.