అంబేద్కర్ కాలేజీలో... వైభవంగా బతుకమ్మ సంబురాలు

అంబేద్కర్ కాలేజీలో... వైభవంగా బతుకమ్మ సంబురాలు

బాగ్​లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ హాజరయ్యారు. లెక్చరర్లు, విద్యార్థులతో కలిసి బతుకమ్మను పేర్చి ఆడి పాడి గంగమ్మ ఒడికి చేర్చారు. 

సరోజా వివేక్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, తదితరులుపాల్గొన్నారు.