V6 News

అంబేడ్కర్ స్ఫూర్తితో రాణించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

అంబేడ్కర్ స్ఫూర్తితో రాణించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

జీడిమెట్ల, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సూరారంలోని తెలుగుతల్లి నగర్​లో శనివారం జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అణిచివేతకు గురైన వర్గాలకు రాజ్యాంగ రక్షణ కల్పించి, వారిని బలవంతులుగా తీర్చిదిద్దిన ఘనత అంబేడ్కర్​కే దక్కుతుందని కొనియాడారు.

లక్షలాది మంది జీవితాల్లో ఆయన ఆశాదీపంగా నిలిచారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి నగర్​లో అరవై గజాల ఇండ్ల పట్టాల సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.