V6 News

ఎందుకు సినిమాలు తీస్తున్నానో అర్థమైంది..రాజమౌళి ఎమోషనల్

ఎందుకు సినిమాలు తీస్తున్నానో అర్థమైంది..రాజమౌళి ఎమోషనల్

మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబ్‌‌‌‌‌‌‌‌ట్రోటర్‌‌‌‌‌‌‌‌ యాక్షన్‌‌‌‌‌‌‌‌ అడ్వంచర్‌‌‌‌‌‌‌‌ మూవీ ‘వారణాసి’.  ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. మెక్సికో నగరంలో జరిగిన పాప్ కల్చర్ అతిపెద్ద వేడుక కామిక్ కాన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ 2026లో ఈ మూవీ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను ప్రదర్శించారు. ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు కార్తికేయ ప్రత్యక్షంగా హాజరు కాగా, వీడియో ద్వారా రాజమౌళి అక్కడి ప్రేక్షకులతో మాట్లాడారు.

 ‘వారణాసి’ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఉన్న టీషర్ట్‌‌‌‌‌‌‌‌తో కనిపించిన రాజమౌళి.. మెక్సికోలోని మాయ నాగిరికత అంటే తనకెంతో ఇష్టమన్నారు. అందుకే ‘బాహుబలి’లోని నగర నిర్మాణానికి మెక్సికోలోని చిచెన్ ఇట్టా నగరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నానన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పుడు అవధులు లేని ఆనందం పొందానని చెప్పారు.  

అలాగే ‘నాటు నాటు’ పాటకు ప్రపంచమంతా కాలు కదిపినపుడు ఎమోషనల్ అయ్యానని, తాను సినిమాలు ఎందుకు తీస్తున్నానో అప్పుడు అర్థమైందని ఆయన చెప్పారు. ఇక ఈ వేడుకలో మూవీ మేకింగ్‌‌‌‌‌‌‌‌కు బీటీఎస్‌‌‌‌‌‌‌‌ వీడియోను ప్రదర్శించారు. అభిమానులకు  ఆ వీడియోను షేర్ చేస్తారని అంతా భావించినప్పటికీ వీడియో బయటకు  రాకుండా మేకర్స్‌‌‌‌‌‌‌‌ జాగ్రత్తలు తీసుకున్నారు.