బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్..కేసీఆర్ బాకీ కార్డులు రిలీజ్

బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్..కేసీఆర్ బాకీ కార్డులు రిలీజ్

  బీఆర్ఎస్ కు  కౌంటర్ గా కాంగ్రెస్ కార్డులు రిలీజ్ చేసింది. పదేండ్లలో కేసీఆర్ నెరవేర్చని హామీలపై కేసీఆర్ బాకీ కార్డు పేరుతో కార్డులు రిలీజ్ చేశారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, అడ్లూరి. జూబ్లీహిల్స్ లోని రహమత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు మహిళలకు 3వేల కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 

ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వివేక్.. గత పదేండ్లు జూబ్లీహిల్స్ ను బీఆర్ఎస్  పట్టించుకోలేదన్నారు .. తాము  ఏ గల్లీకీ  వెళ్లినా సమస్యలపై ఫిర్యాదులొస్తున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. పదేండ్ల పాలనలో  ప్రజలను బీఆర్ఎస్ ఆగం పట్టించిందన్నారు.  రహమత్ నగర్ లో ఖబ్రస్తాన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు.