హైదరాబాద్: ఐటీ మంత్రిగా కేటీఆర్ పదేళ్లు జూబ్లీహిల్స్‌ను భ్రష్టు పట్టించిండని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీశ్ ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయం కావడంతో మంత్రి వివేక్ V6తో మాట్లాడారు. పదేళ్లలో జూబ్లీహిల్స్‌ను బీఆర్ఎస్ పట్టించుకోలేదని.. మున్సిపల్ మంత్రిగా పదేళ్లు కేటీఆర్ ఏం చేయలేదన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు మేం చేసినా సంక్షేమం, అభివృద్ధిని ప్రచారం చేయడంతో పాటు బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రధానంగా వివరించామని తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంట్‌కు కాకుండా అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా అవుతుందన్నారు.
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకుపోతుంది.7 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 19 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎదురీదుతున్నారు. ఇక బీజేపీ అయితే కనీసం పోటీలో కూడా లేదు. జూబ్లీహిల్స్‌లో కమలం పార్టీ కనుమరుగైపోయింది. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో సహా ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. రౌండ్ రౌండ్‌కు భారీగా లీడ్ సాధిస్తూ గెలుపు దిశగా దూసుకుపోతుంది.
