
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్‌లో మంగళవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సంబురాల్లో మంత్రి వివేక్, సరోజా దంపతులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడారు.
మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్‌లో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో వివేక్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మను సుందరంగా అలంకరించి ఆడిపాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ఈ వేడుకలను ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్పొరేటర్ సీఎన్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ చైర్మన్లు, జూబ్లీహిల్స్‌లోని మహిళలు పాల్గొన్నారు.