పెద్దపల్లి జిల్లాలోని NTPC లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన

పెద్దపల్లి జిల్లాలోని NTPC లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన

జ్యోతినగర్, వెలుగు:  పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. బక్రీద్ పండుగ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్టీపీసీలోని ఐఎన్టీయూసీ  జాతీయ నాయకులు, సెంట్రల్ ఎన్​బీసీ  మెంబర్ బాబర్ సలీం పాషా ఇంటికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఐఎన్​యూసీ  నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. బాబర్ సలీం పాషా మంత్రి వివేక్ వెంకటస్వామికి పూలమాల వేసి శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు మల్లికార్జున్, మధు, భూమల్ల చందర్, దేవేందర్ రెడ్డి, పల్లెర్ల జగన్, తిరుపతి రెడ్డి, కుమారస్వామి, శంకర్, మధు తదితర నాయకులు పాల్గొన్నారు. 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కాకా కుటుంబ అభిమాని, సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు,  సయ్యద్​ సజ్జాద్​ ఇంట్లో జరిగిన బక్రీద్​ వేడుకల్లో కార్మిక, మైనింగ్​ శాఖ మంత్రి డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్​ వెంకటస్వామి సజ్జాద్​ కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానులు, కాంగ్రెస్​ నాయకులు మంత్రి వివేక్​ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బండారి సునీల్​, అడ్డగుంట శ్రీనివాస్​, కాకా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.