
మంచిర్యాల: దేశంలోనే ఎక్కడ లేని విధంగా రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి వివేక్. 12 వేల కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని కాంగ్రెస్ నేరవేర్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.
శుక్రవారం (ఆగస్ట్ 22) చెన్నూరు నియోజకవర్గంలోనీ కోటపల్లి, భీమారం, కొల్లూరు, లంబాడి పల్లె, జైపూర్లో పనుల జాతరలో భాగంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్, స్కూల్స్ బిల్డింగ్ పనులకు భూమి పూజ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 12 వేల కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ALSO READ : ఆధార్ కార్డు ప్రభుత్వం జారీ చేసిందే కదా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి పోయిందని, పది సంవత్సరాలలో ఎవ్వరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చాక సుమారు 90 శాతం మందికి రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ప్రతీ రైతుకు రైతు భరోసా నిధులు అందించామని చెప్పారు. ప్రభుత్వం విద్య ప్రధానంగా దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. పేద విద్యార్థులకు కోసం కార్పొరేట్ తరహాలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు.