ముగ్గురు మూడు రకాలు.. పంచాయతీరాజ్ చట్టంపై క్లారిటీ లేని మంత్రులు

ముగ్గురు మూడు రకాలు.. పంచాయతీరాజ్ చట్టంపై క్లారిటీ లేని మంత్రులు

మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న మంత్రులు.. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై తలో తీరుగా మాట్లాడారు. సర్పంచులు – ఉప సర్పంచుల మధ్య ఉన్న చెక్ పవర్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 95 శాతం మంది టీఆర్ఎస్ సర్పంచ్ లే ఉన్నారని.. వారి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. ఇదే సభలో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం.. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు అవకాశమే లేదన్నారు. సవరణలకు సీఎం ఒప్పుకునే అవకాశమే లేదన్నారు. 

సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తాం:  మంత్రి శ్రీనివాస్ గౌడ్

సర్పంచులు – ఉప సర్పంచుల మధ్య ఉన్న చెక్ పవర్ సమస్యను పరిష్కరిస్తాం.  సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తాం. 95% మంది టీఆర్ఎస్ సర్పంచులే ఉన్నారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే. చెక్ పవర్ ఇష్యూ ప్రధాన సమస్య. మిగతా సమస్యలన్నీ పరిష్కారమైతవి. సర్పంచుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం.

పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవకాశమే లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి

సవరణలకు ఆస్కారం లేకుండా నిబంధనల ప్రకారమే గ్రామపంచాయతీలు అభివృద్ది సాధ్యం. చట్టం అమలులో ఇబ్బందులు తొలగాల్సిన అవసరముంది. కొత్త పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవకాశమే లేదు. చట్టసవరణకు ముమ్మాటికీ సీఎం అంగీకరించరు. చట్టం ప్రకారమే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి.

ఉపసర్పంచులు వారం లోపు సంతకాలు చెక్ పవర్ రద్దు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ 

ఉపసర్పంచులు వారం లోపు సంతకాలు చేయించి చెక్ పవర్ రద్దు చేయాలని నిర్ణయించాం. ఒకవేళ సంతకం చేయకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తం.  ప్రజా ప్రతినిధులు నిరుత్సాహ పడొద్దు. ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలకు
అధికారాలు కల్పించే కొత్త చట్టాన్ని ప్రభుత్వం త్వరలో తీసుకువస్తుంది. ఈ విషయం ఇది వరకే సీఎం ప్రకటించారు.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ..

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రిమ్స్ నుంచి ఎయిమ్స్ కు షిప్ట్..

చెట్టుకు ఉరేసుకున్న మైనర్ బాలుడు