పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను సందర్శించిన మంత్రులు

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను సందర్శించిన మంత్రులు

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ అని మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు వెల్లడించారు. బెస్ కమాండ్ కంట్రోల్ తెలంగాణలో ఉందని, కేసీఆర్ హయాంలో ప్రజలు సెక్యూర్టీగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ రూమ్  సెంటర్ ను వారు పరిశీలించారు. వారితో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్, పోలీసు ఉన్నతాధికారులున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ...తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నా్యని, సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ కమాండ్ కంట్రోల్ పని చేస్తుందన్నారు. ప్రజల భద్రతలో ఇది ల్యాండ్ మార్క్ అని మంత్రి తలసాని తెలిపారు. సభలు, ప్రమాదాలు, రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి పోలీస్ లు అక్కడికి సత్వరం చేరుకునేలా పని చేస్తుందన్నారు. దేశానికే ఇది  మణిహారమని, దేశంలో మనదే బెస్ట్ లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రమన్నారు. అన్ని అత్యవసర శాఖలను అనుసంధానం చేస్తూ..మానిటరింగ్ ఉంటదన్నారు. 

ఆగస్టు 4న ప్రారంభం
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పనులు చకచకా పూర్తవుతున్నాయి. 14వ ఫ్లోర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ అండ్ బి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవలే వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్​ పనులు వేగంగా జరుగుతున్నాయి. సీపీ సీవీ ఆనంద్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వందల మంది కార్మికులతో ఎంట్రెన్స్ దగ్గర ఉన్న రోడ్డు మీద చెట్లు తొలగించి కాంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటుతున్నారు. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. అన్ని పనులు ఆగస్టు 2వ తేదీ సాయంత్రం కల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

ఏడేండ్ల నుంచి పనులు
రూ.585 కోట్ల వ్యయంతో హైదరాబాద్​లోని బంజారాహిల్స్ లో పోలీస్​ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రభుత్వం నిర్మిస్తున్నది. షాపూర్ జీ పల్లోంజి కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు చేపడుతున్నది.  2015 లో కమాండ్ కంట్రోల్ భవనానికి సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేయగా.. ఏడేండ్లుగా పనులు సాగుతున్నాయి. కరోనాతో రెండేండ్లు పనులు ఆగిపోగా.. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవటంతో మరికొంత కాలం పనులు నిలిచిపోయాయి.