మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్ర మంత్రులు

మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్ర మంత్రులు

ఉస్మానాబాద్: కేసీఆర్ కిట్ పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చెప్పారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ మండలం మంగరుల్ గ్రామంలోని బాల్ ఆనంద్ భవన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని వారు సందర్శించారు. అక్కడి అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్ వంటి స్కీంల గురించి అక్కడి అధికారులకు వివరించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం తదితర అంశాల గురించి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు ఇస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.