
- దీపాదాస్మున్షీ, ఎంపీ కావ్య, మహిళా ఎమ్మెల్యేలు కూడా
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు, ఎంపీలు, మహిళా నేతలు రాఖీలు కట్టారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, పర్ణిక రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నెరేళ్ల శారద, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, తదితరులు సీఎంకు రాఖీ కట్టారు.
అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి, కుమార్తె, మనవడు పాల్గొన్నారు. మహిళలా నేతలు రాఖీ కట్టడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు.
సెక్రటేరియెట్‌లో చిన్నారులు..
వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న పిల్లలకు అయిదేళ్లలోపు సర్జరీ చేయిస్తే సమస్య పరిష్కారమవుతుంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాద్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల వైద్యానికి వేగంగా సాయం అందిస్తున్నారు. హైదరాబాద్ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో సర్జరీలు ఇటీవల పెద్ద సంఖ్యలో జరగుతున్నాయి.
వినికిడి యంత్రాలు ఇవ్వడం, సర్జరీలు చేయించుకున్న వారికి ఎల్‌వోసీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలిస్తున్నది. ఇటీవల ఈ సర్జరీలు చేయించుకున్న పలువురు చిన్నారులు ఈఎన్ టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్య, డాక్టర్డీకే వీణ ఆధ్వర్యంలో సోమవారం సెక్రటేరియెట్‌కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.