దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది.లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో.. కరోనా వ్యాప్తి నివారణకు సాధ్యమైనంత మేర అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. తాజాగా ప్రకటించిన హాట్ స్పాట్ జిల్లాల వివరాలతో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాల వివరాలను అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపింది. దేశంలో 170జిల్లాలను రెడ్ జోన్ లుగా ప్రకటించిన ఆరోగ్య శాఖ.. 207 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లు, మిగిలిన జిల్లాలు గ్రీన్ జోన్‌లుగా ప్రకటించారు.
కాగా రెడ్ జోన్లో కూడా రెండు రకాలుగా కేంద్రం పేర్కొంది. కరోనా వ్యాప్తి విస్తృతి ఎక్కువగా ఉన్న జిల్లాలు (లార్జ్ ఔట్ బ్రేక్) కాగా, కేసులు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశమున్నట్లు అనుమానిస్తున్న జిల్లాలు (హాట్ స్పాట్ క్లస్టర్).తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 8 జిల్లాలను కేంద్రం రెడ్ జోన్ లుగా ప్రకటించింది.
తెలంగాణలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్.
తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లాలు: నల్గొండ
తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట
ఏపీలో రెడ్ జోన్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్
14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు – ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.

