
తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన న్యాయ మూర్తుల సంఖ్య ను పెంచాలంటూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన 24 న్యాయమూర్తులలో 14 మంది న్యాయ మూర్తులనే నియమించారని ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కోర్ట్ లో కేసులు పేరుకు పోతున్నాయని, ప్రస్తుతం తక్కువగా ఉన్న న్యాయ మూర్తులతో కేసులన్ని పూర్తికాక పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుందన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే .. తెలంగాణ హైకోర్టు కు ప్రస్తుతం కేటాయించిన 24 మంది న్యాయమూర్తుల స్థానంలో 42 మంది న్యామూర్తులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.