మహారాష్ట్రలో స్వల్పంగా భూమి కంపించింది

మహారాష్ట్రలో స్వల్పంగా భూమి కంపించింది

మహారాష్ట్రలో స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం పొద్దున మహారాష్ట్ర సతరా జిల్లాలో తక్కువ తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. పొద్దున 6.42 నిమిషాలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.6 నమోదైంది. ఇది కోయనా ఆనకట్ట నుంచి ఎనిమిది మైళ్ల దూరంలో ఉంది. ఈ ఘటనలో ఆస్తినష్టం, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.