షాకింగ్ న్యూస్..యూపీ కాన్పూర్ లో దారుణం..మైనర్ విద్యార్థినిపై ఇద్దరు కీచక టీచర్ల ఘాతుకం..కొన్ని నెలల పాటు అత్యాచారం..క్రైం ఎపిసోడ్ ను రికార్డు చేసి ఎవరి కైనా చెబితే ఇంటర్నెట్ లో పెడతామని బెదిరింపులు..నీట్ కోచింగ్ కు వెళ్లిన మైనర్ విద్యార్థినికి ఎదురైన భయంకరమైన పరిస్థితి. తల్లికి విషయం తెలిసి పోలీసు ల కు ఫిర్యాదు చేయడంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
ఫతేపూర్ కు చెందిన ఓ మైనర్ విద్యార్థిని కాన్పూర్ లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ లో నీట్ కోచింగ్ కోసం వెళ్లింది. అక్కడే నీట్ పరీక్ష కంటే ముందే ఆ విద్యార్థిని అగ్ని పరీక్ష మొదలైంది. కోచింగ్ ఇచ్చి విద్యార్థినిని తీర్చి దిద్దాల్సిన ఇద్దరు కీచక టీచర్లు ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. దృశ్యాలను రికార్డుచేసి ఎవరికైనా చెబితే ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించారు. 2022 డిసెంబర్ 31 నుంచి కొన్ని నెలల తరబడి ఆ విద్యార్థినిపై ఘాతుకానికి పాల్పడ్డారు.
కోచింగ్ సెంటర్లో బయాలజీ టీచింగ్ చేసే సాహిల్ సిద్దిఖీ, కెమిస్ట్రీ టీచింగ్ చేసే వికాస్ పోర్వాల్ లు దారుణానికి పాల్పడినట్లు విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం, నిర్భంధం, క్రిమినల్ బెదిరింపు , పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జరిగిన నాటికి ఆ విద్యార్తిని వయస్సు 17యేళ్లు.
2022డిసెంబర్ 31 న కొత్త సంవత్సరం వేడుకలకు ఆహ్వానించిన సిద్ధిఖీ.. పార్టీలో అందరు విద్యార్థులు ఉంటారని నమ్మబలికి తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఎపిసోడ్ రికార్డు చేసి ఎవరికైనా చెబితే ఇంటర్నెట్ పెడతానని బెదిరించాడని ఫిర్యాదు చేసింది. కొన్ని నెలలుగా తనపై అత్యాచారం చేశాడని.. తన కుటుంబం ప్రమాదంలోపడుతుందని భయంతో పోలీసులను ఆశ్రయించలేదని ఎఫ్ ఐఆర్ లో తెలిపింది.
ఆరు నెలల తర్వాత బాలిక తల్లి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లడంతో విషయం తెలిసింది. మొదట్లో భయంతో పోలీసులకు చెప్పనప్పటికీ.. సిద్దికీ పదేపదే విద్యార్థినిని బెదిరింపులకు గురి చేస్తుండటంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది.
ఇద్దరు టీచర్లు సాహిల్ సిద్దిఖీ, వికాస్ పోర్వాల్ లపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 328, 376(2), 344, 506 ,పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.