
- మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ
నిజామాబాద్, వెలుగు: అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ హాస్పిటల్స్ తలుపుతట్టే పేదలకు డాక్టర్లు బాసటగా ఉండి నమ్మకం పెంచాలని స్టేట్ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారీ సూచించారు. సోమవారం ఆయన నగరంలోని జీజీహెచ్‌ను విజిట్ చేసి వార్డులు తిరిగారు. తర్వాత డాక్టర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ఇస్తున్న ప్రయారిటీని గుర్తించాలని, కావాల్సిన మెడిసిన్స్ ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలన్నారు. జీజీహెచ్, మెడికల్ కాలేజీ నిర్వహణపై తనకు డిటైల్ రిపోర్టు ఇవ్వాలని కోరారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రావు, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.