రెండు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు

రెండు నెలలుగా  జీతాలు ఇవ్వట్లేదు
  • నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మమ్మద్ రాజమ్మద్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఔట్​సోర్సింగ్​, నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మమ్మద్ రాజమ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల్లోని అన్ని స్కూళ్ల ప్రిన్సిపాల్స్, రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్స్, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 

తమ కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  వెంటనే జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఈ నెల15 తర్వాత జీతాల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ చేపడ్తామని మమ్మద్ రాజమ్మద్ హెచ్చరించారు.