యూట్యూబ్‌లో అత్యాచార బాధితుల దీనగాథలు!

యూట్యూబ్‌లో అత్యాచార బాధితుల దీనగాథలు!

దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పసిపిల్లలు, వృద్దులు అన్న తేడా లేకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు నిత్యకృత్యం కావడంతో బాధితులు తమబాధల్ని ఎవరికి చెప్పులేక, చెబితే కుటుంబ సభ్యుల పరువుపోతుందనో ఇలా రకరకాల కారణంగా గుండె లోతుల నుండి ఉబికి పైకి వస్తున్న ఆవేదనను…. పంటికింద అణిచి మౌనంగా భాదను, కనురెప్పలు వాల్చితే రాలే కన్నీటిని సైతం రానివ్వకుండా చిత్రవధను అనుభవిస్తున్నారు.

అలాంటివారి ఆవేదనను తగ్గించి స్వాంతన కలిగించేందుకు థాయిలాండ్ కు చెందిన మార్క్ ష్విన్ , బిన్ వైరింగలు ప్రయత్నిస్తున్నారు. అత్యాచార బాధితుల దీనగాధల్ని వీడియోలుగా చేసి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది అత్యాచార బాధితులు గురించి యానిమేషన్ రూపంలో జరిగిన దారుణాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అత్యాచార బాధితుల గురించి యానిమేషన్ రూపంలో ప్రపంచానికి ఎందుకు చెబుతున్నారనే ప్రశ్నిస్తే…? మన దృష్టికి రాని ఎన్నో దారుణాల్ని తెలుసుకునేందుకు, మహిళల పట్ల సమాజం దృష్టి మారేందుకు ఇలా చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.