ప్లేఆఫ్‌ ఆశలు గల్లంతు :  బెంగళూరుకు ఏడుపే

ప్లేఆఫ్‌ ఆశలు గల్లంతు :  బెంగళూరుకు ఏడుపే

ముంబై: రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెం గళూరు కథ మళ్లీ మొదటికొచ్చింది. గత మ్యాచ్‌ లో నెగ్గి టోర్నీలో తొలి విజయం సాధించి న కోహ్లీసే న మళ్లీ పరాజయబాట పట్టింది. బ్యాటింగ్‌ లో భారీ స్కో రు చేసే అవకాశాన్ని చేజేతులా జారవిడచుకున్న కోహ్లీసేన..బౌలింగ్‌ లోనూ తేలిపోయిన ఆర్‌ సీబీ సోమవారం జరిగిన మ్యాచ్‌ లో ఐదు వికెట్ల తేడాతోముంబై ఇండియన్స్‌‌ చేతిలో ఓడిపోయింది. ఫస్ట్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌‌ (51 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 75)చ మొయిన్‌ అలీ (32 బంతుల్లో 1 ఫోరు 5 సిక్సర్లతో 50 ) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.

ముంబై బౌలర్లలో పేసర్‌ లసిత్‌ మలింగ (4/31) నాలుగు వికెట్లతో చెలరేగాడు. అనంతరం ముంబై -19ఓవర్లలో ఐదు వికెట్లకు 172 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్‌ క్విం టన్‌ డికాక్‌ (26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) తో పాటు హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 37 నాటౌట్‌ ) సత్తా చాటాడు. టోర్నీలో ఏడో పరాజయంతో బెంగళూరు ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్ర్కమించినట్టే.

రోహిత్‌ –డికాక్‌ జోరు

భారీ ఛేజింగ్‌ లో ముంబైకి ఓపెనర్లు చక్కని ఆరంభాన్నిచ్చారు. డికాక్‌ తో కలిసి రోహిత్‌ (19 బంతుల్లో2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) ప్రత్యర్థి బౌలర్లను నువ్వో ఓవర్‌ .. నేనో ఓవర్‌ అంటూ పంచుకుని బౌండరీల వర్షం కురిపించడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి 67/0 దీటైన స్థితిలో ముంబై నిలిచింది. అయితే ఎనిమిదో ఓవర్‌ లో బౌలింగ్‌ లోకి వచ్చి న మొయిన్‌ .. ఓపెనర్లను పెవిలియన్‌ క పంపి ముంబైకి డబుల్‌‌షా క్‌ ఇచ్చాడు. తొలి బంతికి రోహిత్‌ ను బౌల్డ్‌‌ చేసిన అతను.. నాలుగో బంతికి డికాక్‌ ను వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నాడు. దీంతో నాలుగు బంతుల వ్యవధిలో ఇద్దరు పెవిలియన్‌ కు చేరారు. మూడు సిక్సర్లతో దూకుడు కనబర్చిన ఇషాన్‌ కిషన్‌ (21)ను చహల్‌‌ చక్కని బంతితో బోల్తా కొట్టించాడు. మరోవైపు క్రునాల్‌‌ పాండ్యా (11)తో కాసేపు పోరాడిన సూర్య కుమార్‌ (29)కూడా చహల్‌‌కే చిక్కడంతో ముంబై 129/4తో కష్టాల్లో పడింది. ఆ వెంటనే క్రునాల్‌‌ ఔటైనా, హార్దిక్‌ కీలకదశలో బౌండ్రీల వర్షం కురిపించడంతో మరో ఓవర్‌ ఉండగానే ముంబై విజయం సాధించింది.

ఏబీ–అలీ సూపర్‌ భాగస్వామ్యం

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆర్​సీబీకి ఆరంభంలోనే షాక్‌ తగిలిం ది. ఫామ్‌ లో ఉన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (8) సింగిల్‌‌ డిజిట్‌ కే ఔటయ్యాడు. బెరెన్‌ డార్ఫ్‌ వేసిన గుడ్‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను ఆఫ్‌ సైడ్‌ ఆడబోయిన కీపర్‌ కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ, ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌‌ (20 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్‌ తో 28)తో రెండో వికెట్‌ కు 37 రన్స్‌‌ జోడించి న డివిలియర్స్‌‌ ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టాడు. బెరెన్‌ డార్ఫ్‌ వెసిన ఐదో ఓవర్‌ లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన పార్థివ్‌ 19 పరుగులు రాబట్టాడు. పవర్‌ ప్లే తర్వా తి ఓవర్లో మంచి హాఫ్‌ కట్టర్‌ తో పటేల్‌‌ను ఔట్‌ చేసిన హార్దిక్‌ ఈ జోడీని విడదీశాడు. ఈ స్థితిలో ఏబీకి తోడైన మొయిన్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. వీలుచిక్కనప్పుడు బౌండ్రీలు కొడుతూ ఏబీ సహకారం అందించగా.. అలీ భారీ షాట్లతో రెచ్చి పోయాడు. బెరెన్‌ డార్ఫ్‌ వేసిన 16వ ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లతో స్టేడి యాన్ని హోరెత్తిం చాడు. ఇద్దరి జోరు చూస్తంటే చాలెంజర్స్‌‌ భారీస్కో రు చేయడం గ్యారంటీ అనిపించింది. కానీ, 18వ ఓవర్‌ తొలి బంతికి అలీని, ఐదో బాల్‌‌కు మార్కస్‌ స్టొయి నిస్‌ (0)ను ఔట్‌ చేసిన మలింగ ప్రత్యర్థికి షాకిచ్చా డు. చివరి ఓవర్లో మరో రెండు వికెట్లు తీసి ఆర్​సీబీని కట్టడి చేశాడు.