Mirai Collection: ‘మిరాయ్’ వసూళ్లను ప్రకటించిన మేకర్స్.. తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే?

Mirai Collection: ‘మిరాయ్’ వసూళ్లను ప్రకటించిన మేకర్స్.. తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే?

తేజా సజ్జా-మంచు మనోజ్లు నటించిన ‘మిరాయ్’.. బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తోంది. శుక్రవారం (Sep12న) రిలీజైన ఈ మైథికల్ థ్రిల్లర్.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ (Sep13న) అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి కలెక్షన్స్ ప్రకటించారు.

‘బ్రహ్మాండమైన డే 1 ఓపెనింగ్. నార్మల్ టికెట్ల రేట్లతో.. ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. ఇలానే మిరాయ్ పై మీ ప్రేమను కురిపిస్తూ ఉండండి. అలాగే, బిగ్ స్క్రీన్లలో మాత్రమే మిరాయ్ని ఎంజాయ్ చేయండి’ అని మేకర్స్ ట్వీట్ చేశారు. 

ALSO READ : దర్యాప్తులో జరుగుతుంది ఒకటి..

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మిరాయ్, ఇండియాలో రూ.12 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది తేజ కెరీర్లో అతిపెద్ద డే 1 ఓపెనింగ్గా నిలిచింది. 2024లో విడుదలైన తన హనుమాన్ మూవీ రికార్డును అధిగమించి, మిరాయ్తో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు తేజ. హనుమాన్ విడుదలైన మొదటి రోజే, ఇండియాలో రూ.8 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్లో సైతం మిరాయ్ మంచి వసూళ్లు రాబడుతుంది.