
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మిరాయ్’. తాజాగాఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ సజ్జాతో పాటు ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటులంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పనులన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని, ఆగస్టులో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో తేజ సజ్జా మంచు పర్వత శిఖరాల మధ్య నిలబడి, ఓ మేజిక్ స్టిక్ లాంటిది పట్టుకుని ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు.
ఇదొక యాక్షన్-అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. తేజ సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు. మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తుండగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్, సినిమాటోగ్రఫీతో పాటు మణిబాబు కరణంతో కలసి డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. గౌరహరి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 8 భాషల్లో 2డీ, త్రీడీ ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన తేజ సజ్జా, మనోజ్ మంచు ఫస్ట్ లుక్ పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.