ప్రపంచంలో బెస్ట్​ రెస్టారెంట్…​ ఫ్రాన్స్​లోని మిరాజుర్​

ప్రపంచంలో బెస్ట్​ రెస్టారెంట్…​ ఫ్రాన్స్​లోని మిరాజుర్​

బయట మంచి తిండి తినాలనుకుంటే.. మంచి రెస్టారెంట్​ కోసం చూస్తాం. ఆన్​లైన్​లో ఆర్డర్​ చేయాలన్నా రేటింగ్​ బట్టి ఆర్డర్​ చేస్తాం. మరి, ప్రపంచంలోనే బెస్ట్​ రెస్టారెంట్​ ఏది అంటే… ఆన్సర్​ ఫ్రాన్స్​లోని మిరాజుర్​. ‘ఆస్కార్​’ ఆఫ్​ ద ఫైన్​ డైనింగ్​ వరల్డ్​గా పిలిచే ‘వరల్డ్స్​ 50 బెస్ట్​ రెస్టారెంట్​ అవార్డ్స్​’లో ఆ రెస్టారెంట్​ ఫస్ట్​ ప్లేస్​ను దక్కించుకుంది. సింగపూర్​లోని మెరీనా బే సాండ్స్​లో నిర్వహించిన కార్యక్రమంలో మిరాజుర్​ ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఇటలీ సరిహద్దులకు అతి దగ్గరగా ఉండే మెంటన్​ నగరంలో ఉందీ​ రెస్టారెంట్​. అర్జెంటీనియన్​–ఇటాలియన్​ షెఫ్​ మౌరో కొలాగ్రెకో ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రెస్టారెంట్​లో మెడిటరేనియన్​ ఫుడ్​ వెరీ స్పెషల్. ఈ జాబితాలో ఇండియా నుంచి ఒక్కటంటే ఒక్క రెస్టారెంట్​  కూడా చోటు దక్కించుకోలేకపోయింది. అత్యధికంగా స్పెయిన్​కు చెందిన ఏడు రెస్టారెంట్లు జాబితాలో చోటు దక్కించుకోగా, ఆ తర్వాత ఐదు ఫ్రాన్స్​ రెస్టారెంట్లు టాప్​ 50లో  నిలిచాయి. రెండో స్థానంలో డెన్మార్క్​కు చెందిన నోమా రెస్టారెంట్​ ర్యాంకు కొట్టేసింది. కొత్త ఎంట్రీల్లో మెరుగైన స్థానంలో నిలిచిన రెస్టారెంట్​గానూ ఘనత సాధించింది. ఇక, బ్యాంకాక్​లోని గగ్గన్​ రెస్టారెంట్​ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు ఆసియాలోనే ఉత్తమ రెస్టారెంట్​గా నిలిచింది. కొత్త ఎంట్రీల్లో డెన్మార్క్​ కోపెన్​హాగన్​లో ఉన్న నోమా రెస్టారెంట్​ టాప్​ స్థానానికి గట్టిపోటీనే ఇచ్చింది. కానీ, రెండోస్థానంతో సరిపెట్టుకుంది. అదే బెస్ట్​ రెస్టారెంట్​గా నిలుస్తుందని చాలా మంది అనుకున్నా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. స్పెయిన్​కు చెందిన అసాడర్​ ఎగ్జ్​బరీ మూడో స్థానంలో నిలిచింది. కాగా, 2002లో స్టార్ట్​ చేసిన ఈ అవార్డ్స్​లో ఇప్పటిదాకా స్పెయిన్​, అమెరికా, బ్రిటన్​, డెన్మార్క్​, ఇటలీకి చెందిన రెస్టారెంట్లే విన్నర్లుగా నిలిచాయి. తాజాగా ఫ్రాన్స్​ ఆ జాబితాలో చేరింది.

బెస్ట్​ మహిళా షెఫ్​
బెస్ట్​ మహిళా షెఫ్​గా మెక్సికోకు చెందిన డేనియెలా సోటో ఇన్స్​ అవార్డు గెలుచుకుంది. ఇన్నాళ్లూ ఆడవాళ్లకు అవార్డుల్లో చోటు ఇవ్వలేదు. దీంతో అవార్డుల్లో వివక్ష చూపిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈసారి బెస్ట్​ మహిళా షెఫ్​ కేటగిరీని ప్రవేశపెట్టారు. దీంతో అందరి దృష్టి ఆ కేటగిరీవైపే మళ్లింది. స్పానిష్​ అమెరికన్​ షెఫ్​ జోస్​ ఆండ్రీస్​కు ‘ఐకాన్​ అవార్డ్​’ దక్కింది. ఏ లాభం ఆశించకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు ఉచితంగా ఫుడ్డును అందించడం కోసం ‘వరల్డ్​ సెంట్రల్​ కిచెన్​’ అనే రెస్టారెంట్​ను స్థాపించినందుకుగానూ అతడిని ఈ అవార్డు వరించింది. పారిస్​లోని అర్పీజ్​ రెస్టారెంట్​షెఫ్​ అలైన్​ పస్సార్డ్​కు ‘షెఫ్స్​ చాయిస్​ అవార్డ్​’ దక్కింది. టోక్యోకు చెందిన డెన్​ రెస్టారెంట్​ ‘ఆర్ట్​ ఆఫ్​ హాస్పిటాలిటీ’ అవార్డును అందుకుంది.

టాప్​ 10 రెస్టారెంట్లు

మిరాజుర్​ (మెంటన్​, ఫ్రాన్స్​)

నోమా (కోపెన్​హాగెన్​, డెన్మార్క్​)

అసాడర్​ ఎగ్జ్​బరీ (ఆక్స్​పె, స్పెయిన్​)

గగ్గన్​ (బ్యాంకాక్​)

జెరానియం (కోపెన్​హాగెన్​, డెన్మార్క్​)

సెంట్రల్​ (లిమా, పెరు)

ముగారిట్జ్​ (శాన్​ సెబస్టియన్​, స్పెయిన్​)

అర్పీజ్​ (పారిస్​, ఫ్రాన్స్​)

డిస్​ఫ్రటార్​ (బార్సిలోనా, స్పెయిన్​)