వైరా, వెలుగు : మిర్చి రైతులకు వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ రోశయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వైరా, కొణిజర, మండలాల పరిధిలో ఉన్న కోల్డ్ స్టొరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చికి బాండ్పేపర్ మీద ఆరు నెలల వడ్డీలేని లోన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ యార్డు సెక్రెటరీలకు దరఖాస్తులు అందజేయాలనిసూచించారు.
