ఏనుమాముల మార్కెట్‌‌లో మిర్చికి భారీ ధర.. క్వింటాల్ ధర.. షార్క్‌‌ రకంరూ.15,111లు..టమాటా రకం రూ.30 వేలు

ఏనుమాముల మార్కెట్‌‌లో మిర్చికి భారీ ధర..  క్వింటాల్  ధర..  షార్క్‌‌ రకంరూ.15,111లు..టమాటా రకం రూ.30 వేలు

కాశీబుగ్గ, వెలుగు : మిర్చి సీజన్‌‌ పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే భారీ ధర పలుకుతోంది. శుక్రవారం వరంగల్‌‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో తేజ షార్క్‌‌ రకం మిర్చి క్వింటాల్‌‌ రూ. రూ.15,111లు పలుకగా, టమాటా రకం మిర్చి క్వింటాల్‌‌కు రూ.30 వేలు పలికింది. మరో వైపు మక్కలు (బిల్టీ) క్వింటాల్‌‌కు రూ.2,075 పలికాయి. దీంతో మిర్చి, మక్క రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

 ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... సీజన్‌‌ ప్రారంభం కాకముందు ధరలు భారీగా పలికి, సీజన్‌‌ ప్రారంభంలో మాత్రం తగ్గిపోతుంటాయన్నారు. ఆఫీసర్లలు, ప్రజాప్రతినిధులు స్పందించి ధరల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.