
2019 మిస్ ఇండియా విజేత మాన్సి సెహగల్ సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ నేత రాఘవ్ చద్దా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో.. నిజాయితీగా పాలన జరుగుతోందని అన్నారు. దీనిపై స్ఫూర్తి చెంది తాను పార్టీలో చేరినట్లు సెహగల్ తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె..నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బి.టెక్ పూర్తి చేశారు.