కోలీవుడ్‌‌ ఎంట్రీ ఇస్తున్న మిస్ ఇండియా

కోలీవుడ్‌‌ ఎంట్రీ ఇస్తున్న మిస్ ఇండియా

మిస్‌‌ ఇండియాగా తన అందంతో ఆకట్టుకున్న మానస వారణాసి.. ఇటీవల విడుదలైన ‘కపుల్‌‌ ఫ్రెండ్లీ’ చిత్రంతో నటిగానూ మెప్పించింది. ఈ సినిమాలోని తన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. రెండేళ్ల క్రితం ‘దేవకి నందన వాసుదేవ’ చిత్రంతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు..  ‘కపుల్‌‌ ఫ్రెండ్లీ’తో సూపర్ హిట్ అందుకుంది.  

ఓటీటీలోనూ ఈ చిత్రానికి, తన నటనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్‌‌లో మెప్పించిన మానస కోలీవుడ్‌‌ ఎంట్రీ ఇవ్వబోతోంది.  ఇటీవల ‘టూరిస్ట్‌‌ ఫ్యామిలీ’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్న నటుడు, దర్శకుడు శశికుమార్‌‌‌‌ లీడ్‌‌ రోల్‌‌లో నటించబోతున్న సినిమాలో మానస హీరోయిన్‌‌గా నటించబోతోంది. మణికందన్‌‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శశికుమార్‌‌‌‌ పోలీస్‌‌ ఆఫీసర్‌‌‌‌గా కనిపించబోతున్నాడు. కథకు కీలకమైన, నటనకు ఆస్కారమున్న పాత్రను మానన వారణాసి పోషించబోతోందని సమాచారం.