మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి లేటెస్ట్ రిలీజ్ డేట్..ఎప్పుడంటే?

మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి  లేటెస్ట్ రిలీజ్ డేట్..ఎప్పుడంటే?

అనుష్క శెట్టి(AnushkaShetty), నవీన్ పొలిశెట్టి(NaveenPolishety) లీడ్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(MissShettyMrPolishetty). యూవీ క్రియేషన్స్(UV  Creations) బ్యానర్‌‌‌‌‌‌‌‌పై వంశీ ప్రమోద్(Vamsi Pramod) నిర్మిస్తున్నారు. పి.మహేష్‌‌‌‌ బాబు(Mahesh Babu) డైరెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 4న సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ మూవీ 2023 సెప్టెంబర్ 7న కృష్ణాష్టమీ స్పెషల్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయినా యువి క్రియేషన్స్ ట్విట్టర్..జన్మాష్టమి నాడు మీకు వెన్నతో ముస్తాబు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ట్వీట్ చేశారు. 

దీంతో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన శెట్టి, పొలిశెట్టి ఫ్యాన్స్ కు అద్దిరిపోయే హుషారు ఇచ్చారు మేకర్స్. నవీన్ పోలిశెట్టి కామిక్ యాంగిల్ తో  సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక చాలా కాలం తర్వాత అనుష్క నుంచి మూవీ వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ సినిమాకు రధన్( Radhan) మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలు, టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చెఫ్‌‌‌‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటించగా, స్టాండప్‌‌‌‌ కమెడియన్‌‌‌‌ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ కనిపించనున్నారు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.