
అనుష్క శెట్టి(AnushkaShetty), నవీన్ పొలిశెట్టి(NaveenPolishety) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(MissShettyMrPolishetty). లేటెస్ట్ ఈ మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు హీరో నవీన్ పోలిశెట్టి ట్విట్టర్ లో పేర్కోన్నారు. అందరినీ అలరించడానికి వస్తోన్న ట్రైలర్ చూసి ఆనందంచండి..అంటూ ట్వీట్ చేశారు.ఈ మూవీ వచ్చే నెల (సెప్టెంబర్ 7న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఈ మూవీ చాలా రోజుల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో నవీన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. హీరో నవీన్ పోలిశెట్టి కామిక్ యాంగిల్ తో సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నారు.
ఇక చాలా కాలం తర్వాత అనుష్క నుంచి మూవీ వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రధన్( Radhan) మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే మూడు పాటలు,టీజర్‌ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇందులో చెఫ్ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటించగా, స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ కనిపించనున్నారు.
యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్‌పై వంశీ ప్రమోద్(Vamsi Pramod) నిర్మిస్తున్నారు. పి.మహేష్ బాబు(Mahesh Babu) డైరెక్ట్ చేస్తున్నారు.
And it’s here . Come enjoy the trailer with me . Launching the trailer on the big screen with you guys. Details below. Can’t wait . See you there ❤️❤️ #MissShettyMrPolishetty https://t.co/OTI5fNaOuR
— Naveen Polishetty (@NaveenPolishety) August 19, 2023