Miss Terious Movie Review: ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది!

Miss Terious Movie Review: ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్ 'మిస్ టీరియస్'.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది!

ఇటీవల కాలంలో చిన్న సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్లకు ఆదరణ పెరుగుతోంది. అదే కోవలోనే.. ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా వచ్చి , ప్రమోషన్లతో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం 'మిస్ టీరియస్'  బ్రహ్మానందం వంటి దిగ్గజ నటుడు ఈ చిత్ర ఈవెంట్ కు రావడం, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఈ రోజు రోజు(  డిసెంబర్ 19న ) థియేటర్లలోకి వచ్చంది. సస్పెన్స్, క్రైమ్,  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం...

కథా నేపథ్యం..

రాంకీ (అబిద్ భూషణ్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అయితే, అతను హఠాత్తుగా 15 రోజుల పాటు కనిపించకుండా పోతాడు. ఈ మిస్సింగ్ కేసును ఏసీపీ ఆనంద్ సాయి (బాల రజ్వాది) టేకప్ చేస్తాడు. విచారణలో రాంకీ మాయమవడానికి ముందు ఒక అక్రమ గన్ కొన్నాడని, అలాగే శిల్ప (మేఘనా రాజ్‌పుత్) అనే యువతితో చివరిగా మాట్లాడాడని తెలుస్తుంది. పోలీసులు శిల్ప ఇంటికి వెళ్లేసరికి, ఆమె తన భర్త విరాట్ (రోహిత్)తో కలిసి గోవాలో యాక్సిడెంట్‌కు గురైందని తెలుస్తుంది. మరి శిల్ప ఇంట్లో పోలీసులు చూసిన ఆ యువతి ఎవరు? రాంకీ ఎందుకు కనిపించకుండా పోయాడు? ఒక పోలీస్ ఆఫీసర్ ఇల్లీగల్ గన్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ మిస్ టీరియస్ ’.  

 ట్విస్టుల పరంపర..

దర్శకుడు మహి కోమటిరెడ్డి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా, దానికి సస్పెన్స్, క్రైమ్, హర్రర్ అంశాలను జోడించి నడిపించిన తీరు బాగుందంటున్నారు ప్రేక్షకులు. ఫస్టాఫ్ లో సినిమా ప్రారంభమైన వెంటనే డైరెక్టర్ ప్లాట్ లోకి తీసుకెళ్లారు. విచారణా శైలిలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది. రాంకీ మిస్సింగ్ వెనుక ఉన్న చిక్కుముడులను విప్పే క్రమంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే, విచారణా ఘట్టాలు కొన్ని చోట్ల కాస్త నెమ్మదించి ల్యాగ్ అనిపిస్తాయి. ఇక సెకండాఫ్ లో అసలు కథ అంతా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. హర్రర్ ఎలిమెంట్స్ , క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపు ఈ సినిమాకు ప్రధాన బలం నిలుస్తోంది.

►ALSO READ | Bigg Boss Telugu 9: క్లైమాక్స్‌కి బిగ్ బాస్ 9: సామాన్యుడి అసామాన్య పోరాటం.. టైటిల్ రేసులో కల్యాణ్ చరిత్ర సృష్టిస్తారా?

ఎవరెవరు ఎలా చేశారంటే?

మెయిన్ లీడ్స్ లో రోహిత్, అబిద్ భూషణ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పోలీస్ ఆఫీసర్ గా అబిద్ బాడీ లాంగ్వేజ్ బాగుంది. హీరోయిన్లు మేఘనా రాజ్‌పుత్, రియా కపూర్ గ్లామర్ పండించడమే కాకుండా, ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించారు. ఏసీపీ పాత్రలో బాల రజ్వాది నటన సినిమాకు ఒక సీరియస్ నెస్‌ను తీసుకొచ్చింది. జబర్దస్త్ రాజమౌళి, గడ్డం నవీన్ తమ పరిధి మేర నటించారు.

హర్రర్ టచ్ తో థ్రిల్ ..

అశ్లీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టినట్లు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేసింది. ఎడిటర్ కొన్ని సాగదీత సీన్లను కత్తిరించి ఉంటే సినిమా మరింత రేసీగా ఉండేద అంటున్నారు ప్రేక్షకులు.. ఇక మొత్తంగా చెప్పాలంటే.. ఈ ‘మిస్ టీరియస్’ మూవీ ఒక డీసెంట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. అక్కడక్కడా కొన్ని సీన్లు పాత సినిమాలను గుర్తు చేసినా, క్లైమాక్స్ ట్విస్ట్ , హర్రర్ టచ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వారాంతంలో ఇది ఒక మంచి ఆప్షన్.