బ్యూటీఫుల్ లేడీ ఇక లేరు.. ప్రమాదంలో తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి

బ్యూటీఫుల్ లేడీ ఇక లేరు.. ప్రమాదంలో తీవ్రగాయాలు.. చికిత్స పొందుతూ మృతి

మిస్ వెనిజులా అంద‌గ‌త్తె ఆరియానా ప్రాణాలు విడిచింది. ఆమె వ‌య‌సు 26 ఏళ్లు. కొన్ని రోజుల క్రితం ఆమె కారు ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాల‌పాలైన ఆమె చికిత్స పొందుతూ మృతిచెందిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. 

  కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదానికి గురైన అర్జెంటీనా అందగ‌త్తె ఆరియానా వీరా  ఆగస్టు 3న తుది శ్వాస విడిచింది. ఆమె వ‌య‌సు 26 ఏళ్లు. జూలై 13వ తేదీన ఓర్లాండోలో ఓ ట్రక్కును ఆమె కారు ఢీకొన్నది. నిద్ర మ‌త్తులో డ్రైవ్ చేసి ప్రమాదానికి గురైందామె. మిస్ వెనిజులా టైటిల్ గెలిచిన ఆరియానా.. ప్రమాదం త‌ర్వాత గుండెపోటుకు గురైంది. అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న మిస్ లాటిన్ అమెరికా కాంపిటీష‌న్‌లో ఆమె పాల్గొనాల్సి ఉంది. మోడ‌ల్ ఆరియానా రియ‌ల్ ఎస్టేట్ రంగంలోనూ ప‌నిచేస్తోంది. ఫుల్ హౌజ్ క్లీనింగ్ స‌ర్వీస్‌ను కూడా ఆమె న‌డిపిస్తున్నట్లు ఇన్‌స్టా పేజీలో ఉంది.