ఏపీలో వర్ష బీభత్సం.. తీరం దాటిన తీవ్ర వాయుగుండం... మరో రెండు రోజులు భారీ వర్షాలు..

ఏపీలో వర్ష బీభత్సం.. తీరం దాటిన తీవ్ర వాయుగుండం... మరో రెండు రోజులు భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుధవారం ( సెప్టెంబర్ 23 ) రాత్రి 11 నుంచి ఒంటిగంట సమయంలో కళింగపట్నం దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటిన క్రమంలో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. గడిచిన 6 గంటల్లో తీవ్ర వాయుగుండం గంటకు 3కిమీ వేగంతో కదిలిందని.. మరో 12 గంటలపాటు తీవ్రవాయుగుండంగా  కొనసాగనుందని తెలిపింది. దీని ప్రభావంతో మరో రెండురోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. 

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.ఆ తదుపరి 24 గంటలలో వాయుగుండం క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.

వాయుగుండం తీరం దాటినప్పటికి 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు నమోదయయ్యాయని... 80 ప్రాంతాల్లో 100మిమీకు పైగా వర్షపాతం రికార్డయ్యిందని తెలిపింది వాతావరణ శాఖ. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత అప్రమత్తంగా ఉండాలని.. క్షేత్రస్థాయిలో అధికారులు హైఅలెర్ట్ గా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.