నిఘా నీడలో గచ్చిబౌలి స్టేడియం..350 మంది సిబ్బందితో మిస్ వరల్డ్ పోటీలకు భద్రత

నిఘా నీడలో గచ్చిబౌలి స్టేడియం..350 మంది సిబ్బందితో మిస్ వరల్డ్ పోటీలకు భద్రత

గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మాదాపూర్ జోన్ డీసీపీ డా.వినీత్ తెలిపారు. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరగబోయే ఓపెనింగ్ సెర్మనీకి టూరిజం శాఖ జారీ చేసిన పాసులు ఉన్నవారినే అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. స్టేడియంలో 350 మంది దాకా పోలీసులు బందోబస్తులో ఉంటారన్నారు. ఇప్పటివరకు103 మంది కంటెస్టెంట్లు సిటీకి వచ్చారని, దేశ సరిహద్దుల్లోని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

గచ్చిబౌలి స్టేడియం, హెచ్ఐసీసీ, కంటెస్టెంట్లు బస చేసే హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. డీజీపీ, సైబరాబాద్ సీపీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. మాదాపూర్ జోన్ పరిధిలో కమ్యూనియల్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టామన్నారు. కంటెస్టెంట్లు ప్రయాణించే రూట్లలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కోఆర్డినేట్ చేస్తున్నారని వెల్లడించారు.