
గచ్చిబౌలి స్టేడియం వేదికగా మిస్ వరల్డ్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి పాల్గొన్న కంటెస్టెంట్లు తమదైన శైలి డ్రెస్సుల్లో మెరిశారు. మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా జాతీయ జెండాతో స్టేజ్‌పైకి రాగానే స్టేడియం మొత్తం భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగింది. మిస్ వరల్డ్–2024 క్రిస్టినా పిస్కోవా కిరీటంతో దర్శనమిచ్చింది. చీర కట్టుతో స్టేజ్‌పైకి వచ్చిన మిస్ నేపాలి అందరి దృష్టిని ఆకర్షించింది. - వెలుగు, హైదరాబాద్‌సిటీ