
హైదరాబాద్ సిటీ వెలుగు : కళలకు ఎల్లలు లేవని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నిరూపించారు. మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ శిల్పకళా వేదికగా గురువారం ముగిసింది. మిస్ ఇండోనేషియా నంబర్ వన్ గా (పియానో) సత్తా చాటగా, ఆ తర్వాత రెండో స్థానంలో మిస్ కామెరూన్ (సింగింగ్), మూడో స్థానంలో మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) నిలిచారు. ఇండియన్ కంటెస్టెంట్ నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని ‘డోల్ బాజే’తో ఆహుతులను కట్టిపడేశారు.
అంతకుముందు శిల్పారామంలో ముద్దుగుమ్మల సందడి చేశారు. ఒక్కో స్టాల్ ను పరిశీలిస్తూ ఉత్పత్తులపై ఆరా తీశారు. పలువురు చిన్న చిన్న మట్టి కుండలు, బుట్టలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే సరూర్‌నగర్‌లోని హెరిటేజ్ భవనం విక్టోరియా హోమ్‌లో సుందరీమణులు సందడి చేశారు.