
ఓల్డ్‌సిటీ, వెలుగు: చార్మినార్ వీధుల్లో మిస్ వరల్డ్ థాయిలాండ్–2024 టైటిల్ విజేత ఓపల్ సుచాత సందడి చేశారు. మిస్‌వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఆమె తన పర్యటనలో భాగంగా చార్మినార్ ను సందర్శించారు.
చార్మినార్ పరిసరాల్లోని పట్టు బట్టల దుకాణాలు, హస్తకళల కేంద్రాలను విజిట్చేశారు. అక్కడ కళాకారుల పనితనాన్ని చూసి ముగ్ధులయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇక్కడి సంప్రదాయాలు, పద్ధతులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు.