ముగ్గురు యువతుల మిస్సింగ్

ముగ్గురు యువతుల మిస్సింగ్
  • గ్రేటర్​లో ముగ్గురు మిస్సింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

జవహర్​ నగర్​, వెలుగు:  మల్కాజిగిరి, జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు యువతులు, ఓ మహిళ కనిపించకుండా పోయారు.  అయ్యన్ నగర్​లో ఉండే మోతె శ్రావణి(21) డిగ్రీ సెకండియర్ చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం  షాప్​కి వెళ్లిన శ్రావణి తిరిగి రాలేదు. ఆమె తల్లి బుధవారం పోలీసులకు కంప్లయింట్ చేసింది.  ప్రేం విజయ్​నగర్​ కాలనీలో ఉండే  హ్యారీ(40) ప్రైవేటు హాస్పిటల్​లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఈ నెల 12న డ్యూటీకి వెళ్లిన హ్యారీ తిరిగి రాలేదు. ఆమె భర్త తంబిరాజ్ ​హాస్పిటల్​కు వెళ్లి ఆరా తీయగా..అక్కడికి రాలేదని సిబ్బంది చెప్పారు. దీంతో తంబిరాజ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. యాప్రాల్​లో ఉండే రిది షాద్(22)కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చారు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె తల్లిదండ్రులతో చెప్పింది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటికెళ్లిన రిది షాద్ తిరిగి రాలేదు. ఆమె తండ్రి జవహర్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.