భూపాలపల్లి జిల్లాలో గోదావరిలో గల్లంతైన యువకుడి డెడ్ బాడీ లభ్యం

 భూపాలపల్లి జిల్లాలో గోదావరిలో గల్లంతైన  యువకుడి డెడ్ బాడీ లభ్యం
  •  భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ వద్ద ఘటన

మహదేవపూర్, మంథని / వెలుగు:   గోదావరిలో గల్లంతైన  యువకుడి డెడ్ బాడీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీ వద్ద మంగళవారం కనిపించింది.  స్థానికులు తెలిపిన ప్రకారం..  ఓ వ్యక్తి డెడ్ బాడీ బ్యారేజీ గేట్ల వద్ద నదిలో తేలుతూ కనిపించింది. ప్రెషర్ పాయింట్ లోని ప్రవాహ దిశలో, గేట్ల వద్దకు.. నదిలోకి  తిరుగుతూ చాలా సేపు ఉంది. కొంత సేపటికి నది ప్రవాహ పాయింట్ లోకి చేరుకొని  వేగానికి కాళేశ్వరం వైపు కొట్టుకునిపోయింది. 

కాగా.. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన రావికంటి సాయి(30)గా గుర్తించారు.  దీంతో పోలీస్‌, రెవెన్యూ, ఫైర్‌‌ ఆఫీసర్లు  నదిలోంచి డెడ్ బాడీని  ఒడ్డుకు తీసుకొచ్చారు.  అనంతరం  కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.