వనపర్తి వద్ద పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

వనపర్తి వద్ద పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

ఉవ్వెత్తున ఎగసిపడుతూ.. వృధాగా పోతున్న నీరు

వనపర్తి జిల్లా:  రేవల్లి మండలం నాగపూర్ శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. జిల్లాలోని గ్రామాలకు సురక్షిత త్రాగు నీరు అందిస్తోంది ఈ పైప్ లైన్.. పొలాల మధ్య పైప్ లైన్ డ్యామేజీ కావడంతో నీరు ఉవ్వెత్తున పైకి ఎగిసిపడుతూ..  వృధాగా పోతోంది. చుట్టుపక్కల పంట పొలాల్లోకి ఒక్కసారిగా నీరు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పైప్ లైన్ మరమ్మత్తులు చేసేలోపు… పరిసరాల్లోని పంట పొలాల్లోకి నీరు ముంచెత్తుతోంది. అసలే వర్షాకాలం.. దీనికితోడు.. పైల్ లైన్ నుండి పెద్ద ఎత్తున పొలాల్లోకి నీరు చేరుతుండడంతో తమ పంటలన్నీ దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.