మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ : వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ : వివేక్ వెంకటస్వామి

గత బీఆర్ఎస్ సర్కార్ పై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్టులో పాత పైపులను ఉపయోగించారని చెప్పారు. ప్రాజెక్టు నల్లాల కోసం రోడ్లన్నీ ధ్వంసం చేశారని విమర్శించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. చెన్నూర్ మున్సిపాలిటీలో వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. మున్సిపాలిటీలోని 5 వార్డులలో వాక్ చేసి వార్డు సమస్యలను తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. వెంటనే ధ్వంసం అయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సంభందిత అధికారులను వివేక్ వెంకటస్వామి ఆదేశించారు.