తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా ముర్ముర్ గ్రామం దగ్గర్లోని మిషన్ భగీరథ పంప్ హౌజ్ లో క్లోరిన్ లికేజ్ అవడం వల్ల ఏడుమంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని గోదావరిఖనిలోని సిగ్మా హాస్పిటల్ కి తరలించారు. పంప్ హౌజ్ లో పని చేస్తున్న వారికి కనీస సేఫ్టీకి సంబంధించిన పరికరాలు లేకుండా తమతో పని చేయిస్తున్నారని బాధితులు చెెబుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా సిబ్బందిని పట్టించుకోవడం లేదన్నారు.

