ఇటీవల యానిమేషన్ సినిమాలకు ప్రత్యేక ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో యానిమేషన్ ఫీచర్ ఫిలిం రిలీజ్ కాబోతుంది. ‘మిషన్ సాంటా’ టైటిల్‌తో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఇండియాతోపాటు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో ఈ చిత్రం విడుదలవుతోంది.
హై ఎనర్జీ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ ఇదని, యానిమేషన్ క్వాలిటీ, సినిమాలో ఉండే ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అడ్వెంచరస్ అన్ని ఆడియెన్స్‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయని మేకర్స్ చెప్పారు.
